శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (22:16 IST)

లైగర్ సాంగ్ షూటింగ్ ఓవర్.. కొరియోగ్రాఫ్ అదిరింది.. అనన్యకు బంపర్ ఆఫర్స్

Ananya pandey
డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ ను రీషూట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. లైగర్ క్లైమాక్స్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. రీషూట్ అంటూ వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అని తెలుస్తోంది.
 
ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.  తాజాగా అనన్య పాండే, విజయ్ దేవరకొండ లిగర్ కోసం పాట షూటింగ్ ను ముగించారు. 
 
అనన్య పాండే  ఏడాది పాటు లైగర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ షూటింగ్‌లో అగ్రశ్రేణి కళాకారులు పాల్గొన్నారు. ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ అద్భుతంగా వచ్చిందని.. ప్యాచ్ వర్క్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  విజయ్ దేవరకొండ ఆ టైంలో పూరీని నమ్మి ‘లైగర్’ ఒప్పుకుంటే తన అభిమానులు కొంచెం ఆందోళన చెందిన మాట వాస్తవం.
 
విజయ్ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు పూరి మీద ఉంది. అందుకేనేమో పూరి కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా మేకింగ్ టైం తీసుకుంటున్నాడు ‘లైగర్’ కోసం. కేవలం కరోనా మాత్రమే ఈ సినిమా ఆలస్యానికి కారణం కాదు. పాన్ ఇండియా సినిమా కావడం, కరణ్ జోహార్ లాంటి వాడు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడం పూరి మీద మరింత బాధ్యత పెంచేదే. ఇక ఈ సినిమానటించిన అనన్యకు బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి.