బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (09:34 IST)

విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన వర్మ..

Vijay Devarakonda
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పుడు మాత్రం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలు నిలుస్తున్నారు. ఇక తాజాగా వర్మ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు.
 
అయితే ఈ సారి విమర్శలు కాకుండా.. ప్రశంసలు కురిపిస్తూ విజయ్‌పై ట్వీట్ చేశాడు వర్మ. ఇంతకీ ఏమని ట్వీట్ చేశాడంటే.. `లైగర్‌ సినిమాలో విజయ్‌ కనిపించనున్న తీరు.. గడిడిన ఇరవై ఏళ్లలో వచ్చిన స్టార్‌ హీరోల కంటే అద్భుతంగా ఉండనుంది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందుకు పూరీజగన్నాథ్‌, చార్మీలకు ధన్యవాదాలు` అని పేర్కొంటూ వర్మ ట్వీట్ చేశాడు.
 
దాంతో విజయ్ ఫ్యాన్స్ వర్మ ట్వీట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు.