తాజా కలెక్షన్ కోసం నటి అనన్య పాండేతో చేతులు కలిపిన స్కెచర్స్
యుఎస్‌లో ప్రధాన కేంద్రంగా కలిగిన అంతర్జాతీయ జీవనశైలి, పెర్‌ఫార్మెన్స్ ఫుట్‌వేర్ బ్రాండ్, స్కెచర్స్ తమ ఒరిజినల్స్ కీప్ మూవింగ్ ప్రచారాన్ని మరింతగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా తమ నూతన కలెక్షన్ కోసం నటి అనన్య పాండేతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రచారంలో భాగంగా భారతదేశంలో స్కెచర్స్ ఎనర్జీ రేసర్‌ను ఆవిష్కరించడంతో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్కెచర్స్ డిలైట్స్‌ను స్త్రీలతో పాటుగా పురుషులకు సైతం విడుదల చేయనుంది.
అనన్యతో కలిసి భారతదేశంలో ఎనర్జీ రేసర్‌తో పాటుగా డిలైట్స్‌ను కూడా తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నామని రాహుల్ వీరా, సీఈవో- స్కెచర్స్ దక్షిణాసియా అన్నారు. అన్ని రకాల అభిరుచులకు తగినట్లుగా ఫ్యాషన్‌తో వ్యక్తీకరణ శైలిని మిళితం చేసి కొత్తదనాన్ని ప్రేరేపిస్తున్నాము. అనన్య పాండేతో కలిసి చేసిన స్కెచర్స్ ప్రచారంతో యువత యొక్క అసలైన స్ఫూర్తిని వేడుక చేస్తున్నాము. అది యువత శక్తివంతమైన స్టైల్ స్టేట్‌మెంట్స్‌ను అందించేందుకు సహాయపడటంతో పాటుగా మా డిజైన్స్‌కు వినూత్నమైన శైలినీ అందించనుంది అని అన్నారు.
అధునాతన, సౌకర్యవంతమైన స్నీకర్ల కోసం నా తీరని అభిరుచి, ఎప్పుడూ కూడా సరికొత్త స్కెచర్స్ కలెక్షన్ విడుదలవుతుందన్న ప్రతిసారీ నన్ను మరింత ఉత్సాహపరుస్తుంది అని అనన్య పాండే అన్నారు. స్కెచర్స్ డిలైట్ శ్రేణి నాకు అత్యంత ఇష్టమైన కలెక్షన్. ఇక ఎనర్జీ రేసర్ నన్ను నేను ఫ్యాషన్ పరంగా వ్యక్తీకరించుకునేందుకు సహజసిద్ధమైన కొనసాగింపు. ఒరిజినల్స్ కీప్ మూవింగ్ ప్రచారంలో భాగంగా వీటిని ఆవిష్కరిస్తుండటం వ్యక్తిగతంగా నాకు మరింత ఆనందంగా ఉంది. ఎన్ని కష్టాలెదురైనా అసలైన ఒరిజినల్స్ జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాయనే సందేశాన్ని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ నూతన కలెక్షన్ దేశవ్యాప్తంగా స్కెచర్స్ రిటైల్ ఔట్‌లెట్లుతో పాటుగా ఆన్‌లైన్‌లో స్కెచర్స్ డాట్ ఇన్‌పై కూడా లభ్యమవుతున్నాయి.