Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్ నుంచి పాట.. అక్డీ పక్డీ అదుర్స్

Written By సెల్వి
Updated: మంగళవారం, 12 జులై 2022 (12:12 IST)
పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 
 
పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
 
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌ గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఇక లైగర్ నుంచి మెస్మరైజింగ్ మాస్ బీట్స్‌తో పార్టీ సాంగ్ అక్డీ పక్డీ విడుదలైంది. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్‌గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ.సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది.
 
లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్‌గా వున్నాయి.డ్యాన్స్ మూమెంట్స్‌లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది.
 
విజయ్‌ కి జోడీగా అనన్య పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో వున్నాయి.
 
అక్డీ పక్డీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు.
 
ఈ పాట తమిళ వెర్షన్‌‌కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు 
 
వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌ లు ఆలపించారు.సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు.
 
లైగర్ నుండి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు, ఆసక్తిని పెంచుతోంది. 

అన్నీ చూడండి

కేసీఆర్ బాటలో కవిత.. పేదలందరికీ ఒక్కో ఎకరం భూమి.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Pawan Kalyan: కేరళకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... ఎందుకని?

నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం... నాకు సంబంధం లేదు : కొండా సురేఖ

టీచర్‌కు భయపడి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విద్యార్థి (వీడియో)

భార్యను, సోదరిని చంపేశాను.. ఆత్మహత్యకు ముందు వ్యక్తి వాట్సాప్ స్టేటస్

అన్నీ చూడండి

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు

ఎముక పుష్టి ఏమేమి తినాలి?

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

తర్వాతి కథనం
Show comments