ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జులై 2022 (12:09 IST)

డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వాహన మిత్ర పథకం కింద..?

ys jagan
ఏపీలోని సీఎం జగన్ వాహన డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. 2022-23 సీజన్‌లో కొత్తగా వాహనాలు కొన్న వారికి వాహన మిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఆరు నెలల్లో నెలకు సగటున 300 యూనిట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడిన వారు వాహనమిత్ర పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
 
ఈ పథకం కింద ఏటా రూ. పదివేలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయపన్ను, విద్యుత్ వినియోగం, కులం వంటి వివరాలతో కూడిన పత్రాలను స్థానిక గ్రామ సచివాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
 
ఆరు అంచెల్లో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేనట్టయితే వారికి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. 
 
అర్హులైన లబ్దిదారుల జాబితాను ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదించి 10న కలెక్టరుకు వివరాలు ఇస్తారు. తర్వాత 11,12 తేదీల్లో సంబంధిత కార్పొరేషన్‌కు పంపిస్తారు. తర్వాత వాటిని పరిశీలించి అర్హులకు ఆర్దిక సహాయం చేస్తారు.