ఈ నెల 19వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 తేదీ నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ మరుసటిరోజే అసెంబ్లీని సమావేశపరచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.
ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్ట్రోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వేస్తారు. ఆ మరుసటి రోజే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 23వ తేదీన కొనసాగుతాయి.