బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 జులై 2022 (17:20 IST)

విజయ్ దేవ‌ర‌కొండ దేశంలోనే పెద్ద హీరో రాసిపెట్టుకోండి

puri-karan johar
puri-karan johar
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ప్ర‌స్తుతం బాహుబ‌లి త‌ర్వాత రానా, ప్ర‌భాస్ దేశంలో అంద‌రికీ తెలిసిపోయారు. ఆ త‌ర్వాత ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌.లూ ప్ర‌పంచంలోని సినీ ప్రియుల‌కు తెలిసిపోయారు. కానీ వారంద‌రినీ మించి అన్న‌ట్లుగా ఇప్పుడు విజయ్ దేవ‌ర‌కొండ చేరాడు. విజ‌య్ అంత‌కుముందు న‌టించిన సినిమాలు పెద్ద‌గా హిట్ కాలేదు. నేను రెండేళ్ళ‌నాడు చెత్త సినిమా చేశాను అని ఈరోజు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. లైగ‌ర్ ట్రైల‌ర్‌ను పూరీ జ‌గ‌న్నాథ్ భారీగా ప్లాన్ చేశాడు.

 
క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో హైద‌రాబాద్‌లో సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో రౌడీ ఫ్యాన్స్ అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య జ‌రిపారు. ఈ ఫాలోయింగ్‌ను చూపించాల‌నే ముంబైనుంచి నిర్మాత‌ల‌ను కూడా ర‌ప్పించాడు. అందుకే పూరీ మాట్లాడుడూ,   ట్రైలర్ ఎట్లుంది ? విజయ్ ఎట్లున్నాడు ? చింపిండా లేదా? లైగర్ గురించి కాదు విజయ్ గురించి చెబుతున్నా విజయ్ దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా.. రాసిపెట్టుకోండి. కరణ్ జోహార్ గారు మాకు బిగ్ సపోర్ట్. మిమ్మల్ని చూపించడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచా. మాకు సినిమా అంటే ఎంతపిచ్చో చూపించడానికి ఇక్కడికి పిలిచాను. సరిగ్గా ఇంకా నెల రోజులు వుంది సినిమా. ఇలాగే వుండండి. ఇలాగే వుంటది. కుమ్మేద్దాం. లవ్ యూ'' అన్నారు.