ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్న మహేష్‌బాబు
మహేష్‌బాబు సినిమా సినిమాకూ తన హెయిర్ స్టయిల్ మారుస్తుంటాడు. అదేవిధంగా పాత్ర పరంగా బాడీని కూడా ఫిట్‌గా వుంచుకోవాల్సి వస్తుంది. తాజాగా మహేష్‌బాబు జిమ్‌లో కోచ్ కంట్రోల్‌లో చేతులకు ఫిట్‌నెస్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. తన బాడీని కూడా చూపిస్తున్నాడు. దానికితోడు ఫిట్‌నెస్‌కు తగినట్లుగా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఏది నచ్చినా తినకూడానికి కుదరదు. తన భర్తకు ఏమి కావాలో లెక్క ప్రకారం నమత్ర శిరోద్కర్ రెడీ చేసి ఇస్తుంది.
ఇదే విషయాన్ని సర్కారువారి పాట సినిమాలో ఓ డైలాగ్‌కూడా పెట్టాడు. ఈ బాడీని మెయింటెన్ చేయడానికి పులుసు కారిపోతుందంటూ తనపైనే సెటైర్ వేసుకుని ప్రేక్షకులను నవ్వించాడు. ఇటీవలే ఓ కమర్షియల్ డ్రీంక్ యాడ్ చేసిన మహేష్‌బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. యాక్షన్ థ్రిల్లర్ కనుక బాడీని ఫిట్‌గా వుంచుకోవాల్సి వస్తుంది.