సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (12:10 IST)

త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా

mansoor alikhan
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ శుక్రవారం నటి త్రిష కృష్ణన్, నటి-రాజకీయవేత్త కుష్బూ సుందర్, నటుడు చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. రూ.లక్ష పరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. 
 
మన్సూర్ అలీఖాన్ మొత్తం వీడియోను చూడకుండా పరువు నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
 
గతంలో నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నటి త్రిష కృష్ణన్, లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మాళవిక మోహనన్, చిరంజీవి మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 
 
ఇంకా అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.