సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (17:16 IST)

కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాను.. మీరా జాస్మిన్

meera jasmine
రన్ సినిమాతో తమిళ చిత్రసీమలో అత్యంత ఫేమస్ అయిన నటి మీరా జాస్మిన్. ఆపై బహుభాషా చిత్రాల్లో నటించి అగ్రనటిగా ఎదిగింది. మీరా జాస్మిన్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా నటించడం లేదని ఒక ఇంటర్వ్యూలో మీరా జాస్మిన్ చెప్పింది.
 
ప్రస్తుతం మళ్లీ మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి నటిస్తున్నానని మీరా జాస్మిన్ తెలిపింది. 'టెస్ట్' అనే చిత్రంతో నయనతారతో కలిసి నటించడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఆ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నటించలేదు. ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టాను.
 
తన సోషల్ మీడియా చిత్రాలకు అభిమానుల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వీటన్నింటిని తన ఫాలోవర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా తనకు సహకరిస్తుందని చెప్పుకొచ్చింది.