శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (18:38 IST)

కొత్త సంవత్సరంలో కొత్త రిలేషన్.. శ్రీజ పోస్టు

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తాను ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత ఏడాది తనకు ఇష్టమైన వ్యక్తి గురించి తెలుసుకున్నానంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. 
 
నెటిజన్లు ఈ పోస్టు చూసి రకరకాల పోస్టులు పెట్టారు. శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరూ అనుకునేలా ఆమె ఎవరితోనూ రిలేషన్ లో లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో తనకు తానే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు ఇన్ స్టా స్టోరీలో తెలిపింది. స్వీయ రిలేషన్ లో వుండనున్నట్లు తెలిపింది. ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ ఫోటో పోస్టు చేసింది.