సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (16:51 IST)

గాలివాటానికి మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ అయిపోతారా! షకలక శంకర్‌

Shakalaka Shankar
Shakalaka Shankar
ఇటీవలే ఓ నిర్మాత మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ గురించి చులనకగా మాట్లాడారట. అలా స్టార్‌ అవడం చాలా ఈజీగా అట. రెండు, మూడు సంవత్సరాలు ట్రై చేస్తే మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ అయిపోతారట. దీనిపై నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు షకలక శంకర్‌ విరుచుకు పడ్డారు. శంకర్‌ రాజయోగం అనే సినిమాలో చేశారు. అందులో తాగుబోతు రమేష్‌ కూడా వున్నారు. ఇద్దరు ఒకే వేదికపై శనివారంనాడు కలిశారు. ఈ సందర్భంగా స్టేజీపైకి వచ్చిన షకలక శంకర్‌ ఇలా వ్యాఖ్యానించారు.
 
మొన్ననే ఓ నిర్మాత ఇలా అన్నాడు. గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారు అని అన్నాడు. అది తప్పు. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి.  రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు ట్రై చేస్తే మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ అయిపోతారు. అలా మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ అవడం అంత ఈజీగా కాదు. స్టార్‌ డమ్‌ రావడానికి ఎంత కష్టపడతారో మీకేం తెలుసు. పగలు, రాత్రి తేడా లేకుండా నిద్రలేకుండా, ఆకలిని కూడా భరించి కష్టపడితేకానీ అవ్వరు. అంత ఈజీగా మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ రాలేదు. వారిని చులకనగా మాట్లాడడం చాలా తప్పు. ఆ నిర్మాత ఎందుకన్నాడో తెలీదు. ఎదురుగా ఓ హీరో వున్నాడు. చేతిలో మైక్‌ వుంది కదాని ఏది పడితే మైండ్‌లో అది వాగేయడమేనా. అలా తక్కువగా మాట్లాడకూడదు. ఇది ఎవరికి తగలాలో వారికి తగులుంది అని శంకర్‌ అనగానే, తాగుబోతు రమేష్‌కూడా వంత పాడుతూ వారికి కనెక్ట్‌ అయితే చాలు అంటూ ముగించాడు. మరి ఆ నిర్మాత ఎవరు, మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ అంటే పడదా? డేట్స్‌ ఇవ్వలేదా? ఇవి తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.