సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జులై 2024 (22:31 IST)

లండన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. హైడ్ పార్క్ ఫోటో వైరల్

RC
RC
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, వారి కూతురు క్లిన్ కారా ప్రస్తుతం లండన్‌లో హాలిడేలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం లండన్‌కు వెళ్లింది. 
 
లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో వారందరూ కలిసి నడుస్తున్న ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి, అతని భార్య సురేఖ వారి మనవరాలు క్లిన్ కారా స్త్రోలర్‌ను పట్టుకోగా.. రామ్ చరణ్,  ఉపాసన వారి వెంట నడుస్తున్నారు. 
 
ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ బయలుదేరి వెళతామని చిరంజీవి తెలిపారు. ఇక ఈ వారాంతంలో భారతదేశానికి తిరిగి వస్తారు. చిరంజీవి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత "విశ్వంభర" షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం పనిచేస్తారు.