మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:09 IST)

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయం... బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి 10:00 గంటలకు విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకోనుంది. 
 
ఆ తర్వాత బుధవారం ఉదయం 9:00 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీక్లబ్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. 
 
అనంతరం మధ్యాహ్నం12.30 గంటల నుంచి 1:00 గంటల వరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.