సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (12:02 IST)

చిరంజీవి "సైరా" టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెహ్మాన్‌ది కాదట...

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ చేసి మూవీ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ రివీల్ చేశా

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ చేసి మూవీ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ రివీల్ చేశారు. వీటితో పాటు పాత్రలని పరిచయం చేస్తూ ఓ వీడియోని రూపొందించి విడుదల చేశారు.
 
అయితే మోషన్ పోస్టర్ వీడియోలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఏఆర్ రెహ్మాన్ అదరగొట్టాడని ప్రశంసలు కురిపించారు. కట్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించింది థమన్ అని తేలింది. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి తొలుత థమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే సైరా చిత్రాన్ని నేషనల్ వైడ్‌గా రూపొందించాలని భావించడంతో పోస్టర్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు థమన్‌ని తప్పించి ఏఆర్ రెహ్మాన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారని తెలుస్తుంది. 
 
ఈ మోషన్ పోస్టర్‌కి మ్యూజిక్ అందించే సమయం రెహమాన్‌కి లేకపోవడంతో చెర్రీ, సురేందర్ రెడ్డి ఇద్దరు థమన్‌ని ఒప్పించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించారట. ఈ విషయాన్ని థమన్ ట్విట్టర్‌లో తెలిపాడు. ప్రస్తుతం థమన్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది.