ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (10:52 IST)

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ప్రీ-క్వార్టర్స్‌లోకి పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగ

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పీవీ సింధు కొరియాకు చెందిన కిమ్‌ హో మిన్‌పై 21-16, 21-14తో వరుస సెట్లతో విజయం సాధించింది. 
 
ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగ్గా రాణించిన పీవీ సింధు 49 నిమిషాల్లోనే గెలుపును సొంతం చేసుకుంది. 2013, 2014ల్లో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు.. ఈసారి స్వర్ణ పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇకపోతే.. భారత 13వ సీడ్‌ అజరు జయరామ్‌ లూకా రాబర్‌(ఆస్ట్రేలియా)పై 21-14, 21-12 తేడాతో గెలిచాడు. సింగపూర్‌ ఓపెన్‌ ఛాంప్‌,15వ సీడ్‌ బి సాయి ప్రణీత్‌ వురు నాన్‌ (హాంకాంగ్‌)పై వరుస సెట్లలో 21-18, 21-17తో విజయం సాధించాడు.