ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (12:00 IST)

చుంకీపాండేకు ఇంత అందమైన కూతురా.. డీఎన్ఏ టెస్ట్ చేయాలి : ఫరాఖాన్

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కుమార్తె అనన్య పాండేపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసి ఫరాఖాన్ హాట్ కామెంట్స్ చే

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కుమార్తె అనన్య పాండేపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసి ఫరాఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి అనన్య పాండే ఫోటో చూసిన ప్రతి నెటిజన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఫరాఖాన్ మాత్రం కొంచెం శ్రుతి మించిన కామెంట్స్ చేశారు. 'చుంకీ పాండే కూతురికి ఉండాల్సిన అందం కంటే మరింత అందంగా ఆమె ఉంది. ప్లీజ్.. డీఎన్‌ఏ టెస్ట్ చేయించండి' అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చుంకీ పాండే కుర్రాడిగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడని, అనన్య ఆయన కూతురే అని చెప్పడానికి ఎటువంటి పరీక్షలు అవసరం లేదంటూ ఫరాఖాన్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ఘాటు వ్యాఖ్య చేశారు.