శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (10:39 IST)

హీరో నాగశౌర్య రూ.50 కోట్ల కట్నం తీసుకున్నారా?

naga shaurya - anusha
టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఇంటీరియల్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం కూడా బెంగుళూరులోని ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. 
 
అయితే, నాగశౌర్యకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ ప్రచారం సాగుతోంది. తన పెళ్లికి కట్నంగా నాగశౌర్య రూ.50 కోట్ల మేరకు డబ్బులు తీసుకున్నారన్నది ఆ దుష్ప్రచారం. 
 
నాగశౌర్య మామగారు ఎంత ఇచ్చారు? ఏం ఆస్తులు ఇచ్చారు? అనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. నెటిజన్ల అంచనా మేరకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేరకు కట్నం ఇచ్చారన్నది సమాచారం. 
 
వధువు అనూష పేరు మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. వాటిలో కూడా చాలా వాటిని నాగశౌర్య పేరుమీద రాసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే నాగశౌర్య స్పందించాల్సి ఉంటుంది.