ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (17:12 IST)

కుబేర లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నాగార్జున లుక్

Nagarajuna look
Nagarajuna look
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక మండన్నా నటిస్తున్న చిత్రం కుబేర. సునీల్ నారంగ్, రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్నాడు. అద్దం ముందు తను వున్న ఫొటోతోపాటు మరో ఫోటీను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ఇది వరకే ఓ లుక్ ను విడుదల చేశారు. ‘కుబేర’ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. నాగార్జున వెనుక పెద్ద కంటెనర్ లారీలో డబ్బు ఉండటం.. వర్షంలో నాగార్జున గొడగుపట్టుకుని నిలబడటం.. కళ్లద్దాలతో నాగార్జున లుక్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.