శ్రీలీల పై నందమూరి బాలకృష్ణ ఎటువంటి బాణాన్ని సందిస్తారో!
Kesari team with balakrishna
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వున్న నందమూరి బాలకృష్ణ కొద్దికాలం విరామం తీసుకున్నారు. ఆయన తర్వాత మరెవ్వరూ దానిని పట్టాలెక్కించేందుకు ముందుకు రాలేదు. అల్లు అరవింద్ సారథ్యంలో ఓ రాజకీయ నాయకుడు పార్టనర్‌గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతోంది. తాజాగా మరలా అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ను ముందుకు తెచ్చేందుకు బాలకృష్ణ నడుం కట్టారు.
మరో సంచలనానికి అంతా సిద్దం. భగవంత్ కేసరి టీమ్ తో అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ అవుతొంది. ఎపిసోడ్ 1 ప్రీమియర్స్ అక్టోబర్ 17 వీక్షించండి అంటూ ఆహ పోస్ట్ చేసింది.
చిత్ర టీమ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్, శ్రీలీల, రామ్‌పాల్‌అర్జున్ తో బాలకృష్ణ మాట్లాడించనున్నారు. మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్పించాడని నిర్వాహకులు తెలుపుతున్నారు. మరి శ్రీలీలపై వస్తున్న పెండ్లి రూమర్స్‌కు బాలయ్య బాణాన్ని సందిస్తారో లేదో చూడాలి.