ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:28 IST)

ఏడాదికి వీడ్కోలుగా ది కిల్లర్ స్మైల్ విత్ ఎ కిల్లింగ్ లుక్ తో నాని

nani look
nani look
నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఏడాది మంచి జోష్‌లో వున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ తన ముద్ర వేసుకున్నారు. తన సోదరి ప్రశాంతి దర్శకత్వంలో మీట్‌ క్యూట్‌ సినిమాను నిర్మించి సక్సెస్‌ సాధించుకున్నారు. తాజాగా హిట్‌ 2 సినిమాను అడవిశేష్‌తో చేసి సక్సెస్‌ బాట వేశాడు. ఈ సినిమా యూత్‌కు బాగా నచ్చింది. ఇటీవలే పలు థియేటర్లకు వెళితే అనూహ్యంగా యువత ఆదరణ పొందింది. 
 
nani look
nani look
కాగా, మంగళవారంనాడు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కిల్టింగ్‌ లుక్‌తో ఇలా దర్శనమిచ్చాడు. స్పెసల్‌ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలియజేశాడు. 2022 చక్కటి వీడ్కోలు పలుకుతున్నట్లు ఆయన మాటలు బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది అంటే సుందరానికి మంచి సినిమా అని చేశాం. చాలామందికి చేరువవుతుందని అనుకున్నాం. కొన్ని కారణాలవల్ల పూర్తి స్థాయి ఫలితం రాలేదు. అయినా తర్వాత సినిమాలు మంచి ఆదరణ పొందాయి. అన్నారు. ఇక మీట్‌ క్యూట్‌, హిట్‌ 2 సినిమాలు తెలిసిందే. త్వరలో మాస్‌ ధమాకాగా దసరా చిత్రంతో రాబోతున్నట్లు చెప్పాడు. ఈ సినిమా తర్వాత పాన్‌ ఇండియా మూవీ ఒకటి చేయబోతున్నట్లు వెల్లడిరచారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.