సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (18:10 IST)

మెగాస్టార్ చెప్పిన‌ట్లే మహానటి, రంగస్థలం చిత్రాలకు జాతీయ అవార్డులు

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’,  చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. 
 
తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి ఎంపికైంది. 
 
బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్‌ప్లే నుంచి చిల‌సౌకు, `అ` చిత్రానికి గాను ఉత్తమ మేకప్, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు ద‌క్కాయి. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. `మ‌హాన‌టి`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌కు జాతీయ అవార్డ‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న‌ రిలీజ్‌కు ముందుగానే చెప్పిన సంగ‌తి  తెలిసిందే. మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి ఘ‌నంగా స‌న్మానించిన సంగ‌తి విదిత‌మే. 
 
నాటి ఆయ‌న వాక్కులు నేడు  ఫ‌లించ‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం`కు జాతీయ అవార్డు రావ‌డం. అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డ‌ల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు.