గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (20:17 IST)

దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహానికి హాజరైన కమల్, రజనీకాంత్

shankar daughtyer marriage
shankar daughtyer marriage
తమిళ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ వివాహం నేడు చెన్నైలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అప్పట్లో దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె నటి అదితి శంకర్, వేడుకల నుండి అనేక సంతోషకరమైన ఫోటోలతో క్షణం యొక్క ఉత్సాహాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు.
 
Aishwarya, tharun karthik
Aishwarya, tharun karthik
కాగా, చెన్నై గోల్డెన్ బీచ్ పక్కన జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళ, మలయాళ నటీనటులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నయనతార కుటుంబం, కమల్ హాసన్, విక్రమ్, రజనీకాంత్ తదితర ప్రముఖు హాజరై కనువిందు చేశారు.
 
Aishwarya, tharun karthik  marriage
Aishwarya, tharun karthik marriage
నేడు శివునికి పవిత్రమైన దినం కావడంతోపాటు సప్తమి నాడు వారి వివాహం జరగడం విశేషం.