బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (20:19 IST)

కవల అబ్బాయిల పేర్లను వెల్లడించిన నయనతార

Nayana twins
Nayana twins
వారాంతంలో చెన్నైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమానికి హాజరైన నటి నయనతార తన కవల అబ్బాయిల పూర్తి పేర్లను వెల్లడించింది. తన అబ్బాయిల పూర్తి పేర్ల గురించి హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, "నా మొదటి కుమారుడు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, నా రెండవ కుమారుడు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్..." అంటూ పేర్కొంది.
 
గతేడాది జూన్‌ 9న చెన్నైలో విఘ్నేష్‌ శివన్‌, నయనతార పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి వారి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితులు హాజరయ్యారు. 
 
వారి వివాహానికి వచ్చిన అతిథులలో షారుఖ్ ఖాన్, రజనీకాంత్ ఉన్నారు. వారి పెళ్లైన నాలుగు నెలల తర్వాత, విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరోగసీ ద్వారా కవల అబ్బాయిలను స్వాగతించినట్లు ప్రకటించారు.