బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (19:14 IST)

హీరో నితిన్ - షాలిని నిశ్చితార్థం పూర్తి ... 5 రోజుల పాటు పెళ్ళి వేడుకలు (video)

టాలీవుడ్ యువ హీరో నితిన్ నిశ్చితార్థం ముగిసిపోయింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనకు కాబోయే భార్య షాలినికి ఉంగరం తొడుగుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ నిశ్చితార్థ వేడుకలు షాలిని సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. 
 
ఈ నిశ్చితార్థంతో నితిన్ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పెళ్లి ఘట్టం ఐదు రోజుల పాటు జరుగనుంది. ఇందులోభాగంగా, బుధవారం హైద‌రాబాద్‌లో నితిన్, షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
 
కరోనా నేపథ్యంలో పెళ్లి వేడుకలను నిరాడంబరంగానే నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న రాత్రి  8.30 గంట‌లకు నితిన్, షాలిని వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులను నితిన్‌ తన పెళ్లికి ఆహ్వానించారు. 
 
కాగా, తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లతో పాటు.. అనేక మంది ప్రముఖులకు నితిన్ పెళ్లి ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేసిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఈ పెళ్లి ఏప్రిల్ నెలలో జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మూడు దఫాలు వాయిదాపడింది. చివరకు లాక్డౌన్ ఆంక్షల సడలించడంతో ఈ పెళ్లి వేడుకలు చేపట్టారు.