గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (13:39 IST)

''భీష్మ'' అల్లు అర్జున్ ఫిదా.. నితిన్ అండ్ కోను అభినందించిన స్టార్

''కంగ్రాట్స్ నితిన్‌.. ఇప్పుడు వెడ్డింగ్ సెలెబ్రేషన్ డబుల్ జోష్‌తో జరుగుతాయి. Best thing Happened at the best time.. Really Happy for you. I Congratulate the entire Cast and Crew of Bheeshma.. అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్‌కు అభినందనలు తెలిపాడు. ఇంకా భీష్మ టీమ్ మొత్తాన్ని అభినందించాడు. 
 
కాగా, యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం భీష్మ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. 
 
మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా.. దర్శకుడు వెంకీ సినిమాను కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దారు. నితిన్, రష్మిక యాక్టింగ్ అదిరిపోయింది.