Biodata Maker
✕

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Written By సెల్వి
Updated: సోమవారం, 30 సెప్టెంబరు 2024 (20:26 IST)
Jani Master
కొరియోగ్రాఫర్ షేక్ జానీ అకా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో అరెస్టయ్యాడు. జానీ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. జానీ మాస్టర్.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మైనర్‌గా ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడని ఫిర్యాదు అందడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. 
 
ఈ కేసులో జానీకి ఎలాంటి ఉపశమనం లభించలేదు. జానీ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు జానీని విచారించగా, కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. 
 
జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వున్నాయి. తనకు లొంగని పక్షంలో జానీ మాస్టర్ తనను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడని, సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను మరింత క్లిష్టతరం చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 
 
షూటింగుల సమయంలో వానిటీ వ్యాన్‌లో, తన నివాసంలో కూడా జానీ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకునేందుకు మతం మారాలని జానీ తనను బెదిరించాడని, తన ఇంటికొచ్చి తనపై దాడి చేసిన కేసులో జానీ భార్య కూడా ప్రమేయం ఉందని బాధితురాలు పేర్కొంది. జానీకి ప్రాథమిక రిమాండ్ అక్టోబర్ 3 వరకు ఉంది. అయితే కోర్టు బెయిల్ విచారణను వాయిదా వేయడంతో, అతను అక్టోబర్ 7 వరకు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అన్నీ చూడండి

సీఎంకి శుభలేక ఇస్తే చెట్టపట్టాల్ అంటారా? మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో?: వైఎస్ షర్మిల ఆగ్రహం

మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు: 7,508 నామినేషన్లు దాఖలు

పెంపుడు కుక్కను చంపేసి ఆత్మహత్య చేసుకున్న జంట.. కారణం అప్పులే.. పిల్లలకు చెప్పవద్దని?

నువ్వు చేసుకోపోతే సచ్చిపోతానంది, చేసుకున్నా, ఇప్పుడు వాళ్లు చంపేస్తామంటున్నారు, వీడియో

అన్నీ చూడండి

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం