ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:54 IST)

ఎన్టీఆర్ సింప్లిసిటీ.. వీడియో వైరల్

NTR
NTR
కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. వర్షం పడి కుర్చీలు తడిసిపోతే స్వయంగా వాటిని తుడిచి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత తన కుర్చీని కూడా తుడుచుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్, సుధామూర్తి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, వర్షం పడడంతో సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు వర్షపు నీటితో తడిసిపోయాయి. 
 
అది గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమన్నారు. తర్వాత తన కుర్చీని క్లీన్ చేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.