గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (18:56 IST)

సమంత' ఐటెం సాంగ్ విడుదల: ఉ అంటావా మావా.. (వీడియో)

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాకు సమంత ఐటమ్ సాంగ్ హైలైట్‌గా నిలిచింది. అర్జున్ - రష్మిక కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. వసూళ్ల వర్షాన్ని కురిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది.
 
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ - సమంత కాంబినేషన్‌పై చిత్రీకరించిన 'ఉ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్‌కి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఈ పాట ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.  ఈ పాట వీడియోను మీరూ లుక్కేయండి.