సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (18:18 IST)

పవర్ స్ట్రోమ్ లోడింగ్... పవన్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్

pawan kalyan
నందమూరి హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.  ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షో సెకండ్ సీజన్ భారీ అభిమానులను సంపాదించుకుంది.  తాజాగా ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వచ్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పాల్గొనే ఈ షో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 
 
సంక్రాంతిని పురస్కరించుకుని ఈ ఎపిసోడ్ ట్రైలర్ విడుదలైంది. అన్‌స్టాపబుల్‌ లో పవర్ స్టార్ మానియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రోమ్ లోడింగ్ అంటూ ఒక ఒక చిన్న ప్రోమో విడుదల చేసింది. ఈ వీడియోలో విజువల్స్ పెద్దగా కనిపించలేదు. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో పాటు త్రివిక్రమ్, సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.