బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:02 IST)

ఓ మై గాడ్.. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దూ..., పాయల్ రాజ్‌పుత్ కేకలు

పాయల్ రాజ్‌పుత్, ఈ పేరు వినగానే మనకు ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సెక్సీ కళ్లతో కవ్వించే నటన కనబరిచి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపిన నటి పాయల్. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపధ్యంలో అందరిలానే ఇంటికే పరిమితమయ్యింది.
 
కానీ ఈ కాలంలో తన శరీరాకృతిని పర్ఫెక్టుగా మెయిన్ టైన్ చేస్తూ ఇంట్లోనే వ్యాయామం చేస్తూ వచ్చింది. తన ఆకృతి గురించి ఎప్పటికప్పడు శ్రద్ద తీసుకునే పాయల్ కు ఇన్‌స్టాలో 26 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ప్రతిరోజూ వారితో మాటామంతి చేస్తుంటుంది.
లాక్ డౌన్ సడలించిన తర్వాత షూటింగులో పాల్గొనేందుకు సమాయత్తమయ్యాననీ, ఐతే షూటింగ్ లో పాల్గొనాలంటే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలనే నిబంధన వుండటంతో తను కూడా పరీక్ష చేయించుకున్నానని చెప్పింది. ఆ టెస్టు చేసేటపుడు భయంతో వణికిపోయాననీ, కేకలు పెట్టానని చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిని వీడియోను పోస్టు చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Aaaouchh