సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (10:26 IST)

రజనీకాంత్, సిమ్రాన్, త్రిష కాంబోలో పెట్టా.. థియేటర్లు దొరుకుతాయా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా తెలుగు హక్కులను సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. 
 
సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో పెట్టాకి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుందని భావించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన ''బాషా'' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా కన్నడంలోనూ డబ్ అయ్యిందని టాక్ వస్తోంది.