మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: బుధవారం, 29 జులై 2020 (13:56 IST)

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

రామ్ గోపాల్ వర్మ పై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణ నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసారు.
 
నాయీ బ్రాహ్మణ కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండలం నాయీ బ్రాహ్మణ సంఘం వెల్లడించింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండు చేసారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ప్యాన్సుకు ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు.
 
వర్మ తమకు క్షమాపణ చేప్పాలని డమాండ్ చేసారు. లాక్ డౌన్ సమయంలో కూడా వర్మ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ కులాన్ని కించపరిచారని నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసాయి.