బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (16:55 IST)

చంపడానికి ప్లాన్ వేశారని తెలియగానే చాలా ఏడుపు వచ్చింది.. : ప్రకాష్ రాజ్

తనను చంపడానికి ప్లాన్ వేశారని తెలియగానే చాలా ఏడుపు వచ్చిందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పాడు. కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను కొందరు దుండగులు ఆమె నివాసంలోనే కాల్చి చంపిన విషయం తెల్సిందే.

తనను చంపడానికి ప్లాన్ వేశారని తెలియగానే చాలా ఏడుపు వచ్చిందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పాడు. కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను కొందరు దుండగులు ఆమె నివాసంలోనే కాల్చి చంపిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు నిందితులను అరెస్టు చేసింది. వీరివద్ద జరిపిన విచారణలో గౌరీ లంకేష్ తరహాలోనే ప్రకాష్ రాజ్‌ను కూడా చంపాలని ప్లాన్ వేసినట్టు వెల్లడించారు. హిందూ వ్యతిరేకిగా మారడం వల్లే సినీ నటుడిని చంపాలని భావించినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
 
దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయని, ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని, తమ అభిప్రాయాలను వ్యతిరేకించానని తనను చంపడమే కరెక్ట్ అని నిందితులు భావించారన్నారు. దేశంలో ఇంకొక గౌరిలంకేష్ హత్య జరగకూడదు అని అనుకోవడమే తప్పు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇంతకు ముందు కూడా అనేకమంది తనకు సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ రూపంలో చంపేస్తామని బెదిరించారని, కొంతమంది తనపై అక్కడక్కడ దాడికి కూడా పాల్పడ్డారని తెలిపారు. తనను చంపడానికి ఫ్లాన్ చేశారని తెలిసి చాలా ఏడుపు వచ్చిందన్నారు. 
 
చంపేస్తూ ఎంతమంది ప్రజల నోరు మూయిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు. మొదటిసారి తనను అంతమొందించేందుకు ఇంత భారీ ప్లాన్ చేశారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. ఇటువంటివాటికి తాను భయపడేది లేదని, తన వాయిస్ ఇంకా పెరుగుతుందని జస్ట్ ఆస్కింగ్ కొనసాగుతుందని సృష్టం చేశారు.