డార్లింగ్ ఫ్యాన్సుకు శుభవార్త.. రాధే శ్యామ్ అంటూ వచ్చేసిన ప్రభాస్, పూజా లుక్
డార్లింగ్ ఫ్యాన్సుకు శుభవార్త. సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ప్రస్తుతం హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ ఖరారు చేశారు. 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. అలానే ప్రభాస్ లుక్ కూడా వదిలారు. ఇందులో ఆయన లుక్ ప్రేక్షకులకి కిక్ ఇస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
హాస్యనటుడు ప్రియదర్శి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాషా ఛేత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం.
మరోవైపు 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమాలో నటించిన ఎయిర్‌టెల్ గర్ల్ సాషా ఛేత్రి ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. 'భీష్మ' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన తమిళ హాస్యనటుడు సత్యన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.