ప్రియమణి డాక్టర్ 56 ఫస్ట్ లుక్
Priyamani Doctor 56 First Look
ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద అందిస్తున్నారు. ఇది వరకే ఈ బ్యానర్ మీద మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.
ప్రస్తుతం ప్రియమణి నటించిన డాక్టర్ 56 అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీద రిలీజ్ చేశారు . ఈ సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా.. రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి. టి నిర్మిస్తున్నారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని డా . చల్లా భాగ్యలక్ష్మీ , జె లక్ష్మణ్ అందించారు.
ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.