శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:51 IST)

విడుదలకు సిద్దమైన వరలక్ష్మి శరత్ కుమార్ చేజింగ్

Varalakshmi Sarath Kumar
Varalakshmi Sarath Kumar
సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ  తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ చేంజింగ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది  వరలక్ష్మి శరత్ కుమార్. 
 
ఇప్పటికే తమిళ్‌లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ పై ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం  లాంటి  పలు సూపర్ హిట్ సినిమాలను  తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో అదే చేజింగ్ పేరుతో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
 
వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో కె. వీరకుమార్‌ దర్శకత్వంలో ఈ  ‘చేజింగ్‌’ మూవీ తెరకెక్కింది.  మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు. తాషి మ్యూజిక్ అందించగా.. E కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ చేపట్టారు. తెలుగులో కూడా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.