హీరో తరుణ్‌తో సన్నిహితంగా మెలిగా.. ఎందుకంటే... : ప్రియమణి

priyamani
ఠాగూర్| Last Updated: సోమవారం, 23 నవంబరు 2020 (08:02 IST)
టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ప్రియమణి ఒకరు. ప్రస్తుతం ఈమె వ్యాపారవేత్త ముస్తఫా రాజాను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. అయితే, ప్రియమణి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అలా నటించిన చిత్రాల్లో నవ వసంతం ఒకటి. ఈ చిత్రంలో తరుణ్ హీరోగా నటించాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. దీంతో తరుణ్ - ప్రియమణి ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా, వీరిద్దరు ఉండటాన్ని చూసిన తరుణ్ తల్లి రోజారమణి... వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనీ భావించి, తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రియమణిని కోరిందట.

ఇదే అంశంపై ప్రియమణి ఇపుడు స్పందించారు. హీరో తరుణ్‌తో కలిసి నటించిన 'నవ వసంతం'. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బాగా స్నేహం ఏర్పడింది. తామిద్దరం లంచ్‌లు, డిన్నర్లకు కూడా వెళ్లేవాళ్ళం. దాంతో ప్రజలు తమను ప్రేమజంటగా భావించారని ప్రియమణి వెల్లడించింది.

ముఖ్యంగా, తరుణ్ ఎంతో సరదాగా ఉంటాడని, అందుకే అతనితో తాను సన్నిహితంగా మెలిగానని వివరించింది. "ఓ రోజు సెట్స్ పైకి రోజారమణి కూడా వచ్చారు. ఆమె నా వద్దకు వచ్చి... మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది.

ఇష్టమైతే తరుణ్ ను పెళ్లిచేసుకోవచ్చు అని చెప్పారు. దాంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. వెంటనే తేరుకుని, తరుణ్ తో ఉన్నది కేవలం స్నేహమేనని, మీరు పొరబడ్డారని చెప్పాను" అంటూ నాటి సంగతులు పంచుకుంది.దీనిపై మరింత చదవండి :