గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (13:49 IST)

భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు: రెచ్చగొడితే యుద్ధం తప్పదంటున్న భారత్

భారత్ చైనా మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చల్లో భాగంగా నిన్న ఎనిమిదోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సారి తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోని చుషూల్ వద్ద ఉదయం 9.30 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయి.
 
భారత బృందానికి లెప్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్ లోని వివాదస్పద ప్రాంతాల నుండి సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, సైనికుల ఉపసంహరణపై రోడ్ మ్యాప్ ఖరారు చేయడం వంటి వాటిపై ప్రధానంగా చర్చలు జరిగాయి.
 
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో ఉద్రిక్తత పరస్థితి నెలకొన్నాయని, కాబట్టి యుద్ధానికి దారితీసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని తెలిపారు. తూర్పు లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుస్సాహసానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా బలగాలను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుండడంతో చైనాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. చైనా, పాక్ కలిసి ప్రాంతీయ ఉద్రిక్తతకు పాల్పడుతున్నాయని రావత్ తెలిపారు.