బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (17:20 IST)

తెలుగు హీరోల‌ను ఆలోచించేలా చేసిన‌ పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మర‌ణం

Puneet Rajkumar zym
క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మర‌ణం తెలుగు సినిమా రంగాన్ని క‌దిలించింది. ప‌రిచ‌యం వున్న‌వారు స‌రే, అస‌లు ప‌రిచ‌యంలేని కొత్త‌త‌రం హీరోలు సైతం పునీత్ మ‌ర‌ణం తీరు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీని కంత‌టికి జిమ్‌లో వ్యాయామం చేయ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. చాలా మంది గంట‌ల‌త‌ర‌బ‌డి జిమ్‌లో వున్నామంటూ చెబుతుంటారు. వారంతా ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. ఒక వ‌య‌స్సు వ‌చ్చాక జిమ్‌లో బెంచ్‌ప్రెస్‌లు, ఫుష‌ప్స్‌, బార్‌లు అనేవి చేసేట‌ప్పుడు శిక్ష‌కుని ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేయాల్సివుంటుంది. ఆ త‌ర్వాత అందుకు త‌గిన ఫుడ్‌ను, ద్ర‌వ ప‌దార్థాల‌ను తీసుకోవాల్సివుంటుంది. నీరు ఎక్కువ‌గా తాగాల్సివుంటుంది. 

 
కొంద‌రు బాడీ బాగా రావ‌డానికి కొన్ని టాబ్లెట్స్‌ను కూడా వేసుకుంటుంటారు. బాహుబ‌లి సినిమా స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రానా కూడా క‌స‌ర‌త్తులు బాగానే చేశారు. వాటిని కూడా రాజ‌మౌళి ద‌గ్గ‌రుండి వారి శ‌రీర వాతావ‌ర‌ణానికి అనుగుణంగా చేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంత ఇదిగా కండ‌లు గ‌ల శ‌రీరాన్ని వారు మ‌లుచుకున్నారు. ఆ త‌ర్వాత అవి త‌గ్గించుకొనే క్ర‌మంలో అనారోగ్యం పాల‌య్యార‌నే విష‌యం కూడా టాలీవుడ్‌కు తెలిసిందే.

 
ఇక ఇక్క‌డ‌కు వ‌చ్చేస‌రికి పునీత్ రాజ్‌కుమార్ ఓ తాజా సినిమా కోసం కండ‌లు పెంచుతున్నార‌ని టాక్ వుంది. ఆ సినిమాలో భాగంగా దాదాపు రెండు గంట‌లు వ్యాయాయం చేశాడ‌ని బ‌య‌ట విడుద‌లైన వీడియ‌లోను బ‌ట్టి తెలుస్తుంది. అయితే వారి కుటుంబంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇంత‌కుముందు జ‌రిగాయి క‌నుక జాగ్ర‌త్త‌గా వుండేబాగుండేద‌ని ప్ర‌ముఖ సీనియ‌ర్ హీరో తెలియ‌జేశారు.

 
ఇప్ప‌టికే శివరాజ్ కుమార్‌కూడా ఇలాగే జిమ్ చేస్తుండ‌గా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌నీ,  ఆ త‌ర్వాత కోలుకున్నార‌ని తెలిసిందే. అయితే ముందుగానే వ్యాయమం ఎక్కువైతే కండ‌లు, న‌రాలల‌లో తేడా క‌నిపిస్తుంది. ఎక్కువ‌గా అల‌సిపోయిన‌ట్లుంటుంది. హెచ్చ‌రికగా న‌ల‌త కూడా అనిపిస్తుంది. స‌రిగ్గా ఇటువంటిదే పునీత్ కు గురువారంనాడు సూచ‌న‌లు క‌నిపించాయి. కానీ ఆయ‌న దాన్ని స‌రిగ్గా అర్థం చేసుకోలేక జిమ్‌ను కొన‌సాగించ‌డ‌మే పెద్ద పొర‌పాటుగా అనిపిస్తుంది.

 
సెంటిమెంట్‌ను గ‌మ‌నించాలి
సినిమా వాల్ళ‌కు సెంటిమెంట్ అనేది ముఖ్యం. ఏది చేసినా ముందుగా దేవుడిమీద భారం వేసి ముహూర్తాలుకానీ షూటింగ్‌కు వెళ్ళ‌డంలోకానీ చేస్తుంటారు. పునీత్కు పుట్టిన‌పుడే ఆయ‌న తండ్రి రాజ్‌కుమార్ కూడా పునీత్ పుట్టిన‌ప్పుడే లోహిత్ అని నామ‌క‌ర‌ణం చేశారు. కానీ పండితులు ఆ పేరు పెడితే అర్థాయుషువు అవుతాడ‌ని చెప్ప‌డంతో పునీత్‌గా మార్చారు. సో. ఇలాంటి సెంటిమెంట్‌ను తేలిగ్గా తీసుకోకూడ‌ద‌ని సినిమాల‌కు మూహూర్త‌పు పెట్టే వేణుస్వామి తెలియ‌జేస్తున్నాడు. 

 
పునీత్ మ‌ర‌ణించాక క‌న్న‌డ దూర‌ద‌ర్శ‌న్ ఆయ‌న ఇంట‌ర్యూ టెలికాస్ట్ చేసింది. అందులో  యోగా, ప్రాణాయ‌మం, ధ్యానం వంటివి చేస్తుంటాన‌నీ నా ఫిట్‌నెస్‌కు కార‌ణ‌మదేన‌ని వెల్ల‌డించారు. కానీ జిమ్‌ను అప్పుడ‌ప్పుడు చేస్తుంటాన‌ని కూడా వివ‌రించారు. అలాంటిది ఒకేసారి కండ‌లు పెర‌గాల‌ని ఇలా చేయ‌డం కూడా స‌రైందికాద‌ని డాక్ట‌ర్లు కూడా తెలియ‌జేస్తున్నారు.

 
ఈ విష‌యంలో గ‌తంలో ఎన్.టి.ఆర్‌. కూడా బాగా లావుగా వున్నాడ‌నీ, ఇత‌ర మార్గాల‌లో త‌గ్గ‌డం ఆ త‌ర్వాత  అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డం తెలిసిందే. ఇదే రీతిలో దాస‌రి నారాయ‌ణ‌రావు ఉదంతాన్ని కూడా కొంద‌రు సీనియ‌ర్ న‌టులు గుర్తుచేసుకుంటున్నారు. ఏదిఏమైనా ఓ మాన‌వ‌తావాది, మంచి న‌టుడ్ని కోల్పోయామ‌ని బాల‌కృష్ణ‌కూడా వ్యాఖ్యానించారు. పునీత్ ఉదంతం తెలుగులో చాలా మంది హీరోల‌కు జిమ్‌ల‌కు వెళ్ళ‌డంలో కాస్త ఆలోచన‌లో ప‌డిన‌ట్ట‌లు సీనియ‌ర్ న‌టులు తెలియ‌జేస్తున్నారు.