రజనీకాంత్ ఆశీర్వాదం చాలా సంతోషంగా వుందిః లారెన్స్
నటుడు, డాన్సర్, దర్శకుడు రాఘవ లారెన్స్ జన్మదినం ఈరోజే. శనివారంనాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీర్వదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ స్పందిస్తూ, నా పుట్టినరోజు సందర్భంగా తలైవర్ మరియు గురువు నుండి ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక సేవ చేయాలని నిర్ణయించుకుంటాను, ఈ సంవత్సరం ఆకలి విలువ తెలిసినందున అన్నదానం చేయాలని ప్లాన్ చేస్తున్నాను.
వీటి కోసం నేను వ్యక్తిగతంగా కొన్ని ప్రాంతాలను సందర్శిస్తాను. నాకు వీలున్నప్పుడల్లా ఆహారం పంపిణీ చేస్తాను. నాకు మీ ఆశీస్సులు కావాలి. అంటూ కోరారు. తాజాగా రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న వేసవిలో థియేటర్స్ లో అలరించనుంది.