గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (20:01 IST)

సూపర్ స్టార్‌తో లైకా ప్రొడక్షన్స్ రెండు భారీ చిత్రాలు

rajini - subhaskaran
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయస్సు మీదపడుతున్నా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల "అన్నాత్త"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. తాజాగా "జైలర్‌"గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. యువ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇపుడు మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరొందిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ రజనీకాంత్ హీరోగా రెండు చిత్రాలు నిర్మించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం శుక్రవారం కుదుర్చుకున్నారు. 
 
స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లిన లైకా సంస్థ అధినేత సుభాకరన్, ఆ సంస్థ హెడ్ తమిళ్ కుమరన్‌, డిప్యూటీ ఛైర్మన్ ప్రేమ్ శివస్వామిలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రజనీకాంత్‌తో లైకా సంస్థ రెండు చిత్రాలు నిర్మించనుందని ఆ సంస్థ అధికారంగా వెల్లడించింది. 
 
కాగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ రజనీకాంత్ హీరోగా "2.0" చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో భారీ మొత్తంలో నిర్మించిన విషయం తెల్సిందే. ఇపుడు ఇదే బ్యానరులో రెండు చిత్రాలు నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం వచ్చే నెల ఐదో తేదీన జరుగనుంది.