శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (14:50 IST)

సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ రజినీకాంత్ "పేట"

సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "పెట్టా" చిత్రాన్ని "పేట" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ... "సూపర్ స్టార్ రజినీకాంత్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా తెరకెక్కిన "పేట" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
 
చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్‌కు వీరాభిమాని. అందుకే రజినీకాంత్‌ను ఆయన తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటాయి. అటు మాస్ ఆడియెన్స్‌ను, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మంచి చిత్రమిది.
 
ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాం" అన్నారు. త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దీన్ సిద్ధికి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్, నిర్మాత: వల్లభనేని అశోక్.