గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (15:29 IST)

భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపిన గొప్ప దర్శనికుడు : రజనీకాంత్

ratan - rajini
భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన గొప్ప దార్శనికుడు పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా అని సూపర్ స్టార్ రజనీకాంత్ కొనియాడారు. రతన్ టాటా మృతిపై సూపర్ స్టార్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచిన గొప్ప దార్శనికుడు, ఐకానిక్ రతన్ టాటా అని అన్నారు. 
 
వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి.. తరతరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి.. అందరూ ప్రేమించే, గౌరవించే వ్యక్తి రతన్ టాటా అని కొనియారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం. ఈ ఐకానిక్‌తో గడిపిన ప్రతి క్షణాన్ని ఎన్నిటికీ మరిచిపోలేను. భారతదేశపు నిజమైన పుత్రుడు ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను రజనీకాంత్ పేర్కొన్నారు. 
 
భారతదేశం ఓ పుత్రుడిని కోల్పోయింది : ముఖేశ్ అంబానీ ఎమోషనల్ పోస్ట్ 
 
భారత పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా మృతిపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశం విశేషమైన పుత్రుల్లో ఒకరిని కోల్పోయిందంటూ సుధీర్ఘ పోస్టు పెట్టారు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు. ప్రయమైన స్నేహితుడిని కోల్పోయానంటూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సుధీర్ఘ పోస్ట్ చేశారు. 
 
"రతన్ టాటా మరణంతో భారతదేశం తన అత్యంత విశిష్టమైన, దయాగుణం కలిగిన పుత్రుల్లో ఒకరిని కోల్పోయింది. రతన్ టాటా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన వాటిని మన దేశానికి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ ఛైర్మన్ 1991లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టాటా గ్రూప్‌ను 70 రెట్లు పెంచారు. రిలయన్స్ కంపెనీ, నీతా అంబానీ, ఇతర అంబానీ కుటుంబం తరపున టాటా కుటుంబ సభ్యులకు, మొత్తం టాటా గ్రూపు సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రతన్.. మీరెప్పుడూ నా హృదయంలో నిలిచే ఉంటారు" అని ఎక్స్ పోస్టులో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 
 
రతన్ టాటా మరణం భారతదేశానికి దుఃఖ దినమని ముకేశ్ అంబానీ అభివర్ణించారు. తనకు వ్యక్తిగత నష్టమని విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటాను దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, పరోపకారిగా, ప్రియమైన స్నేహితుడిగా ముకేశ్ అంబానీ అభివర్ణించారు. దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, దాతృత్వ నాయకుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. 
 
గ్లోబల్ స్థాయిలో భారత్ ఎదగడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని ముకేశ్ అంబానీ కొనియాడారు. దేశాభివృద్ధికి, దాతృత్వానికి ఎనలేని సహకారం అందించారని ప్రస్తావించారు. టాటా గ్రూపును ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. సద్గుణవంతుడు, గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తినిస్తాయని ముకేశ్ అంబానీ అన్నారు.
 
రతన్ టాటా మరణం టాటా గ్రూపుకేకాకుండా ప్రతి భారతీయునికి పెద్ద నష్టమని ముకేశ్ అంబానీ అన్నారు. వ్యక్తిగత స్థాయిలో తనకు కూడా తీరని శోకాన్ని నింపిందని విచారం వ్యక్తం చేశారు. తాను ప్రియమైన ఒక స్నేహితుడిని కోల్పోయానని, ఆయన చర్య తనకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. భారతదేశం ఒక పుత్రుడిని కోల్పోయింది.