బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:54 IST)

పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నా : ఆర్జీవీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇవి వివాదాస్పదమయ్యాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇవి వివాదాస్పదమయ్యాయి. వీటిపై రాంగోపాల్ వర్మ తన స్పందనను తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
 
తాను పవన్‌కు పెద్ద ఫ్యాన్ అని.. తన ఇంట్లో తన తల్లి, చెల్లి అందరూ పవర్ స్టార్‌కి అభిమానులే అన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన పెద్ద కోరిక అని చెప్పారు. శ్రీరెడ్డి వర్సెస్ పవన్ కల్యాణ్‌ వివాదంపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు వర్మ. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.