బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (18:14 IST)

రంగ‌మ్మ‌త్త పాత్ర ముందుగా నాకే వ‌చ్చింద‌న్న రాశి

Raasi
న‌టి రాశీ ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా వెలుగు వెలిగింది. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసింది. వైవాహిక జీవితం త‌ర్వాత సినిమాలు త‌గ్గించింది. కానీ ఆడ‌పా ద‌డ‌పా ఏవైనా అవ‌కాశాలు వ‌స్తే చేస్తుండేది. అలా వ‌చ్చిన అవ‌కాశ‌మే రంగ‌మ్మ‌త్త పాత్ర‌. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన `రంగ‌స్థ‌లం` సినిమా తెలిసిందే. అందులో రంగ‌మ్మ‌త్త పాత్ర కోసం ముందుగా రాశిని అడిగారు. క‌థ మొత్తంగా విన్న‌ది బాగా న‌చ్చింది. కానీ పాత్ర విష‌యంలో కొన్ని ఇబ్బందులు వున్నాయ‌ని వ‌ద్ద‌నుకుంది.
 
క‌థ‌లోని ఆ పాత్ర వ‌స్త్రధార‌ణ విష‌యంలో నాకు ఇబ్బంది అనిపించిది. మోకాలు పైవ‌ర‌కు చీర క‌ట్టుకోవాలి. ఆ లుక్ నాకు స‌రిపోద‌ని అనిపించింది.  అందుకే నేను చేయ‌న‌ని చెప్పేశాను. అయితే ఆ పాత్ర‌కు అన‌సూయ పూర్తి న్యాయం చేసింది. ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింద‌ని ఇటీవ‌లే ఆమె తెలియ‌జేసింది. అదేవిధంగా `నిజం` సినిమాలో నేను చేసిన నెగెటివ్ పాత్ర నా త‌ప్పిద‌మే. ఆ నిర్ణ‌యం తీసుకోకుండా వుండాల్సింది అంటూ వివ‌రించింది.