సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (12:41 IST)

పవన్‌ను పెళ్లి చేసుకోకపోయినా.. అది జరిగిదే.. రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్లీ కామెంట్స్ చేశారు. రేణు దేశాయ్ రాసిన ''ఏ లవ్ అన్ కండిషనల్'' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం వివాదాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో తాను ఈ పుస్తకాన్ని పవన్‌ను ఉద్దేశించి రాయలేదని రేణూ క్లారిటీ ఇచ్చారు. బాధతో రాసినా, ఆనందంతో రాసినా రొమాంటిక్‌గా రాసినా.. ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ గురించేనని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 
 
ప్రతి వ్యక్తి జీవితంలోనూ.. సంతోషం, దుఃఖం వుంటాయని.. అందులో తన జీవితం మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. 2014లో తనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు రచనా వ్యాసాంగంపై ఆసక్తి పుట్టిందని, అప్పటి నుంచే తాను ట్విట్టర్‌లో ఉన్నానని రేణు వెల్లడించారు. తాను రచించింది తన మనసులోని మాటలే తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కాదని స్పష్టం చేశారు. 
 
తాను 12 ఏళ్ల పాటు పవన్‌తో సంసారం చేశానని.. ఆయనతో కలిసి ఇద్దరు బిడ్డలకు తల్లినయ్యానని చెప్పింది. ఒకవేళ.. ఆయనతో కాకుంటే.. ఇంకొకరితో తనకు వివాహం జరిగేదని.. వారితో బిడ్డల్ని కనివుండేదాన్ని అంటూ వ్యాఖ్యానించారు. తన అనుభవాలనే కవితలుగా మార్చానని, వీటిని తెలుగులోకి అనువదించేందుకు సహకరించిన అనంత శ్రీరామ్‌కు కృతజ్ఞతలని వెల్లడించారు.