సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:11 IST)

శృంగారంలో పాల్గొంటేనే అతడు మగాడా? కాదా? తెలుస్తుంది : వర్మ హీరోయిన్

shree rapaka
టాలీవుడ్ హీరోయిన్ శ్రీరాపాక సంచలన కామెంట్ చేశారు. ఒక వ్యక్తి శృంగారంలో పాల్గొంటేనే అతడు మాగాడా? కాదా? అని తెలుస్తుందన్నారు. పైగా, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలో నటించి మంచి పాపులర్ అయిన శ్రీరాపాక.. ఇపుడు హాట్ కామెంట్స్ చేసి మరోమారు వార్తలకెక్కారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 
 
పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడం తప్పు లేదన్నారు. అందులో పాల్గొంటేనే అతను మగాడా? కాదా? అనే విషయం తెలుస్తుందన్నారు. పెళ్లి జరిగిన తర్వాత అతడు మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. గతంలో తన స్నేహితురాలికి జరిగిన ఒక అనుభవాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. తన ఫ్రెండ్ తొలి రాత్రి.. ఆమె భర్త ఒక గే అనే విషయం తెలిసిందని చెప్పింది. దీంతో తన ఫ్రెండ్‌ ఎంతో బాధపడిందని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.