శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (12:31 IST)

డూప్లికేట్ చంద్రబాబు ఎక్కడున్నారో.. ఆచూకీ తెలుపండి.. : వర్మ వినతి

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తదుపరి దర్శకత్వం వహించనున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం షూటింగ్ దసరా పండుగను పురస్కరించుకుని ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఆయన మరోమారు స్పష్టంచేశారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19వ తేదీన తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.
 
ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో రామ్ గోపాల్ వర్మ ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు‌లానే ఉన్నారు. ఏదో హోటల్‌లో భోజనాలు వడ్డిస్తున్నారు. 'ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా' అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ బయోపిక్‌కు సంబంధించిన వివరాలను ఈ నెల 19వ తేదీన తిరుపతిలో వెల్లడిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి దండలు మార్చుకుంటున్న నాటి ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నారా చంద్రబాబునాయుడు కూడా ఉండటం గమనించవచ్చు.