మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 మే 2022 (12:49 IST)

గ్లామ‌ర్‌కు నిర్వ‌చ‌నం ఇచ్చిన రితికా నాయక్

Rhita Naik
Rhita Naik
హీరోయిన్లు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తార‌! అని అడిగితే అస‌లు గ్లామ‌ర్ అంటే ఏమిటి? 
పైకి క‌నిపించేదా! ఇన్‌ర్‌గా వుండేదా! అంటూ ప్ర‌శ్నిస్తుంది వ‌ర్థ‌మాన నాయిక రితికా నాయక్. ఈమె  అశోక వనంలో అర్జున కళ్యాణంలో న‌టించింది. సినిమా ప్ర‌మోష‌న్‌లోనూ ఈమె పేరు ప్ర‌స్తావ‌న లేదు. రుక్సానా హీరోయిన్ వుంద‌నే తెలుసు. కానీ సినిమా క‌థంతా రితికా చుట్టూ తిరుగుతుంది. దీనిపై నెటిజ‌న్లు 'అవుట్ ఆఫ్ సిలబస్' అని అభివర్ణించారు. దీని అర్థం మొద‌ట్లో తెలీయ‌లేదు. న‌న్ను విమ‌ర్శిస్తున్నార‌ని అనుకున్నా. కానీ ఆ త‌ర్వాత అర్థ‌మ‌యింది. నా పాత్ర‌ను వారెంతో ప్రేమించారు అంటూ సెల‌విచ్చింది. అందరి ప్రేమ మరియు ప్రశంసలను చూడటం చాలా ఆనందంగా ఉంది.
 
నేను ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ మోడ‌లింగ్ రంగంలోనూ ప్ర‌వేశించింది. అయితే సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ఓకేనా అంటే.. గ్లామ‌ర్‌లో అభినయం ఉండదు.  ఆఫ్‌స్క్రీన్‌లో కూడా గ్లామరస్‌గా ఉండవచ్చు. నటిగా గ్లామ‌ర్ అనే అడ్డుగోడ‌లు మాత్రం వేసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది.